నీరు మంటలను ఎలా అర్పుతుంది ?

           సాధారణంగా మంటలను ఆర్పటానికి నీటిని ఉపయోగిస్తాము. ఏదయినా యెల్లు లేదా దుకాణానికి నిప్పంటుకున్నప్పుడు అగ్నిమాపక దళంవారి వాహనాలు వచ్చి వీటిని చిమ్మి మంటలను ఆర్పుతాయి అగ్ని మాపక దళములు లేనిచోట ప్రజ బకెట్లతో, బిందెలతో నీటిని చిమ్మి మంటలార్పుతారు.
నీరు మంటలను ఎలా ఆర్పుతుందో మీకు తెలుసా?

నీటి ద్వారా మంటలను చల్లార్చే విధమును తెలుసుకునే ముందు నిప్పు ఎలా అంటు కుంటుందో తెలుసుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవించటానికి మూడు కారణాలున్నాయి. మండే వస్తువులు కర్రలు, బొగ్గు, కాగితములు నిప్పు రాసుకోవడానికి ఆక్సిజను వాయువు ఉండటం: ఉష్ణము లేక వేడి ఎక్కువగా ఉండటము. వేడివల్లనే తగలబడే వస్తువులు అత్యధిక తాపమానానికి చేరుకుంటాయి. ప్రతి వస్తువు ఒక నిర్ణీత తాపమానం దగ్గర మండుతుంది.
         ఈతాపమానము నే వస్తువు యొక్క ఇగ్నిషన్ పాయింట్’ అంటారు. వస్తువు యొక్క వేడి ఇగ్నిషన్ పాయింట్ వరకు చేరితే వస్తువు తగులబడ నారంభిస్తుంది. వాతావరణంలోని ఆక్సిజన్ దీనికి మరింత దోహదం చేస్తుంది.
             మంటలను ఆర్పటానికి వాతావరణంలోని ఆక్సిజనును మంటలను చేరకుండా ఆపు చెయ్యాలి. ఎందుకంటే ఆక్సిజను లేకుండా ఏ వస్తువు ఉండదు తరువాత వస్తువు యొక్క వేడిమిని తగ్గించినా మంటలారుతాయి. నిప్పుపై నీటిని చల్లినప్పుడు కాలే వస్తువు యొక్క వేడి తగ్గుతుంది. నీళ్ళను ధారగా పోసినట్లయితే మంటలు త్వరగా చల్లారతాయి.
         అయితే గ్రీసు, ఇతర తైలములకు నిప్పంటుకుంటే నీటిద్వారా ద్వారా ఆపలేము. ఎందుకంటే అవి నీటి కంటే పలుచగా ఉంటాయి. నీళ్లు పోస్తే అవి నీటి పైన తేలు తూ మండుతాయి ఇటు వంటి మంటలను ఆర్పడానికి వేరే అగ్ని మాపక యంత్రాలున్నాయి
            ఈ వ్యసానికి సంబంధించిన వీడియో లింక్స్ క్రింద ఇచ్చాను 👇🏽 తప్పక చూడండి
https://youtu.be/Yl5pe1erAD4

please like,share through social media like Facebook and Twitter and WhatsApp…etc and don’t forget subscribing
Thank you for reading and watching my articles and videos 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started