కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర

దిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.*

సుశీల్‌ చంద్ర సీఈసీగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.



Leave a comment

Design a site like this with WordPress.com
Get started